బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్, సంగమేశ్వర కాలనీ చౌరస్తా వద్ద నాగుల పంచమి సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ ఆవు పాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా పంచమి రోజున ఆవుపాలు వితరణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాండ్ల కృష్ణ, చాకలి మహేష్,బోడ రాంచందర్,శంకర్,శివ సూరి, సంజయ్, పోల్కం గోపాల్,రాంపూర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
