26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నెలక్రితమే పెళ్లి.. అంతలోనే విషాదం

Must read

📰 Generate e-Paper Clip

చెక్ డ్యాం వద్ద  నీటి మట్టం పరిశీలిస్తుండగా గుండెపోటుతో ఏఈఈ మృతి  కమ్మర్ పల్లి మండలంలో ఘటన

కమ్మర్​పల్లి, బతుకమ్మ : చెక్ డ్యాంలో నీటి లెవెల్స్ తీసేందుకు తోటి సిబ్బందితో వెళ్లిన ఏఈఈ నితిన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈఘటన కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఈఈ నితిన్ శుక్రవారం సాయంత్రం కమ్మర్​పల్లి మండలం కోనాపూర్ గ్రామ శివారులోని రాళ్లవాగు చెక్ డ్యాములో నీటి లెవెల్స్ తీసేందుకు తోటి సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో నీటిమట్టం పరిశీలిస్తుండగా.. నితిన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. దీంతో సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్​కు చెందిన నితిన్ 2024 అక్టోబర్​లో ఏఈఈగా ఉద్యోగం సాధించాడు. నితిన్​కు నెల క్రితమే వివాహం జరగడం గమనార్హం.

More articles

Latest article