బతుకమ్మ, ఆర్మూర్ : రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ ఆధ్వర్యం లో ఆర్మూర్ పట్టణం లోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్, ఇతర కాలనీలలో రోడ్డు కు ఇరువైపుల వున్న డ్రయినేజీ, మురికి గుంటలలో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మన పరిసరాలలో మురికి గుంటలలో మురికి నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. ఆయిల్ బాల్స్ వల్ల దోమలు, వాటి గుడ్లు నశిస్తాయి అని అన్నారు. మీర శ్రావణ్ ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, ఎస్ జి శ్రీకాంత్, కోశాధికారి గొనె శ్రీధర్, కార్య నిర్వహణ కార్యదర్శి డాక్టర్ బెతు గంగాధర్, తులసి పట్వారి, ఖాందేష్ సత్యం, మీరా శ్రావణ్ సంస్థ సభ్యులు ఖొడే శ్రీనివాస్, నరేష్, కళ్యాణ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
