కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న కామారెడ్డి జిల్లా స్థాయి యువజన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కళాభారతి ఆడిటోరియంలో పోటీలు నిర్వహిస్తామని, సాంస్కృతిక విభాగంలో జానపద నృత్యం(బృందం), జానపద నృత్యం (వ్యక్తిగత/ సోలో), జానపద గీతాలు ( బృందం), (వ్యక్తిగత/ సోలో), సైన్స్ మేళా, హస్తకళ, వస్రకళ, ఆర్గో ఉత్పత్తుల పై కళాభారతి ఆడిటోరియంలో పోటీలు ఉంటాయని చెప్పారు. కథ రచన, పెయింటింగ్,( డిక్లరేషన్/ ఎలుకేషన్), కవిత్వం పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన కళాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన కళాకారులను వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే యువతీయువకులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారై ఉండాలని స్పష్టం చేశారు.
