29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి జిల్లాలో 29.64లక్షల మొక్కల లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • వన మహోత్సవానికి అధికార యంత్రాంగం సమాయత్తం
  • జూన్ లో ప్రభుత్వ శాఖల ద్వారా మొక్కలు నాటేందుకు నిర్ణయం

 

కామారెడ్డి, బతుకమ్మ : ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. 2025-26 సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లాకు 29.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేషించింది. జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ అది దిగువన ఉన్న నిజామాబాద్ జిల్లాకే వరంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్,జుక్కల్ ప్రాంతాల్లకు కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు ఏ మూలకూ సరిపోవడం లేదు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పంటలకు బోరుబావులే దిక్కు. నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న ప్రాంతాల్లో మొక్కలు ఎక్కువ నాటాలని అధికారయంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో అటవీ శాఖ, గ్రామీణాభివ్రుద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు.

రెండవ ఏడాది కామారెడ్డి జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో 29.64లక్షల మొక్కల లక్ష్యం నిర్దేషించగా వివిధ శాఖలకు అందులో లక్ష్యంగా మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ అభివ్రుద్ధి శాఖకు 12లక్షలు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో 9.20లక్షలు, అటవీ శాఖకు 2.88లక్షలు, వ్యవసాయ శాఖకు 2.55లక్షలు, ఉద్యానవన శాఖకు 1.27లక్షలు, ఎక్సైజ్ శాఖకు 1.35లక్షలు, ఇతర శాఖల ఆధ్వర్యంలో 36వేల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేషించారు.

వానాకాలంలో వర్సాలు పడటం ప్రారంభం కాగానే మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం సిద్ద మౌతుంది. డీఆర్ఢీఏకు ఎక్కువ లక్ష్యం కేటాయించడంతో వాటి నర్సరీల ద్వారా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు మొక్కల పంపిణీ ఏర్పాట్లు చేశారు.జూన్, జులై, ఆగస్తు మాసాల్లో మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసేవిధంగా ప్రణాళిక చేశారు.ప్రతీ సీజన్ మాదిరిగానే జామా, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, చింత, ఫెల్టోఫాం, గుల్లోహర్ చెట్లను పంపిణీకి సిద్ధం చేశారు. ఈత చెట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా పంపిణీ చేసి, సొసైటీలకు అదేవిధంగా కాలువ, చెరువు గట్ల వెంట నాటేవిధంగా ప్రొత్సహించనున్నారు. ఇంటికి ఆమరు మొక్కలను పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. రైతులకు కూడా వారి అవసరాలలను తీర్చే విధంగా మొక్కల పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈసారి కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మొక్కలు నాటడం, వాటి పరిరక్షణ లక్ష్యాలను నిర్దేషించారు.

More articles

Latest article