- దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో నిర్వహించడం అభినందనీయం
- సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు కళాకారులకు గౌరవం పెరిగిందని సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల అన్నారు. మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు సోమవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సిర్ప లింగం, దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సభాధ్యక్షులు కోనేరు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కవులు కళాకారుల సేవలు వెలకట్టలేనివని, దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దాశరథి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపనుందని ఈ సందర్భంగా వెల్లడించారు. కవులు కళాకారులు ఎక్కడైతే ప్రోత్సహించబడతారో అక్కడ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలి దశ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా ఖిల్లా జైలులో దాశరథి రాసిన తెలంగాణ కోటి రతనాల వీణ 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిని నింపిందని అన్నారు. దాశరథిని జైలులో బంధించిన కవిత్వం రాస్తూ, ప్రశ్నించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు కాసర్ల నరేష్ రావు, శ్రీనివాస్ ఆర్య, మద్దుకూరి సాయి బాబు, అష్ట గంగాధర్, కర్క రమేష్, సాయి లవోల, దారం పోతన్న, ఆంజనేయులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
