27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంత ఖరీదైన తగ్గేదే లేదు..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ఆకుకూరలు కంటి చూపుకు మంచివని, కూరగాయలు శరీరానికి మంచివాని రకరకాలుగా అంటుంటారు. ఒక్కొక కూరగాయ ఒక్కొక ప్రత్యేకత ఉంటుంది.  కానీ బోడ కాకరకాయలో మాత్రం ఎక్కువ సంఖ్యలో  విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్, కార్బోహైడ్రేట్స్ ,ఫైబర్స్, రిబోప్లివిన్, నియాసిన్, కెరాటి న్, థయామిన్, విటమిన్ సి, ఆస్కార్భి ఆమ్లం పుష్కలంగా దొరుకుతాయి. దీనికి తోడు ఏటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా సహజ సిద్ధంగా అడవిలో దొరికే కాయలు కావడంతో వీటితో ఆరోగ్యం మంచిగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ బోడ కాకరకాయలు కేవలం జూలై ఆగస్టు మాసాల్లో మాత్రమే లభిస్తాయి. అందువలన మార్కెట్ లో వ్యాపారు లు కిలో  రూ. 250 అమ్ముతున్న ప్రజలు సంతోషంగా తీసుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు. చికెన్ ఇష్టపడే వారు కిలో చికెన్ రూ. 170 – 190 ఉన్న ప్రజలు మాత్రం కిలో రూ. 250 ధర ఉన్న బోడ కాకరకాయల్ని ఇష్టంగా తీసుకెళ్తున్నారని వ్యాపారాలు పేర్కొన్నారు.

More articles

Latest article