25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిఘా కళ్లపై నిర్లక్ష్యపు నీడలు

Must read

📰 Generate e-Paper Clip

  • పర్యవేక్షణలో నిర్లక్ష్యం

 

బతుకమ్మ, బాన్సువాడ :  బాన్సువాడ పట్టణంలో సీసీ కెమెరాల నిర్వహణ గాలికి వదిలేయడంతో అస్తవ్యస్తంగా మారాయి. పట్టణంలో దొంగతనాలు, వాహన చోరీల నిందితులు కేసులు చేదించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అధికారులకు సవాల్గా మారింది. పట్టణంలో గతంలో సిఐగా పని చేసిన మహేష్ గౌడ్ సీసీ కెమెరా ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించి పట్టణ ప్రజలకు, వ్యాపారస్తుల దాతల సహకారంతో 115 సీసీ కెమెరాలు పట్టణంలో పలు కాలోనిలలో ప్రధాన రహదారిలో సీసీ కెమెరా లను బిగించారు. సీసీ కెమెరా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఫలితంగా 115 నిఘా నేత్రాలు అన్ని ప్రాంతాల్లో పనిచేశాయి. ఇదే తీరులో బాన్సువాడ పట్టణ సిఐగా ఉన్న మహేష్ గౌడ్ హయంలోని బాగానే ఉన్నాయి. అధికారుల వరుస బదిలీలతో పోలీసింగ్ సేవలతో పాటు సిసి కెమెరాలను పట్టించుకోనివారు కరువయ్యారు. ప్రస్తుతం పట్టణంలో మొత్తం 115 కెమెరాలు కూడా సరిగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో దాతల సహాయం తో సీసీ కెమెరాలు బిగించి, గ్రామ పంచాయతీ అనుసంధానం చేశారు. పలు గ్రామాల్లో,పట్టణాల్లో సిసి కెమెరాలు మూలన పడ్డాయి. పర్యవేక్షించే వారు లేకుండా పోయారు. సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో బాన్సువాడ కేంద్రంగా రాత్రి వేళల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం, ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్, తాడ్కోల్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఆయా ప్రధాన రోడ్డులో సీసీ కెమెరాల పని చేయక పోవడంతో పట్టణ ప్రజలు పోలీస్ అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వరుస చోరీలు జరుగుతున్నాయని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏవైనా నేరాలు సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేసి ప్రైవేటు వ్యక్తుల, దుకాణదారులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై ఆధార పడాల్సివస్తుంది. ఇప్పటికైనా సీసీ కెమెరాలపై పోలీస్ ఉన్నత అధికారులు దృష్టిసారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article