- సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మహిళా ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి సోమవారం వచ్చారు. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అట్టి మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారురాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా విన్నారు. ఆ మహిళ ఫిర్యాది పేరు భామని సవిత , టౌన్ – 2 పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడు అని తెలిపారు. ఈ మహిళ ఫిర్యాదిరాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు.
