24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రంలో పరువు హత్య కలకలం..!

Must read

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలొ ఘటన

జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో యువకుడు దారుణ  హత్యకు గురయ్యాడు. ఈహత్య స్థానికంగా సంచనలంగా మారింది. ఎస్సీ వర్గానికి చెందిన మల్లేశ్ (28)ను గురువారం కత్తులతో పొడిచి చంపారు. మరో కులానికి చెందిన అమ్మాయిని మల్లేశ్ ప్రేమించాడని.. అందుకే హత్య చేశారని మల్లేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి ఇంటికి వెళ్లి మల్లేశ్ గొడవ చేసిన తర్వాత శవమై కనిపించారు. యువతి తండ్రి రాజిరెడ్డి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారు. రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ బంధువులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

More articles

Latest article