రాష్ట్రంలో పరువు హత్య కలకలం..!
జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలొ ఘటన జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈహత్య స్థానికంగా సంచనలంగా మారింది. ఎస్సీ వర్గానికి చెందిన మల్లేశ్ (28)ను గురువారం కత్తులతో పొడిచి చంపారు. మరో కులానికి చెందిన అమ్మాయిని మల్లేశ్ ప్రేమించాడని.. అందుకే హత్య చేశారని మల్లేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి ఇంటికి వెళ్లి మల్లేశ్ గొడవ చేసిన తర్వాత శవమై కనిపించారు. యువతి తండ్రి రాజిరెడ్డి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు....