26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యాధికారమే లక్ష్యంగా ముదిరాజులు పోరాడాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో మనమే గెలవాలి
  • రాజకీయ పార్టీలకు ముదిరాజులు ఓటు బ్యాంకుగా మారకూడదు
  • కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : రాజ్యాధికారంలో వాటాయే లక్ష్యంగా ప్రతి ముదిరాజ్ బిడ్డ పోరాడాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్ పిలుపునిచ్చారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల ముదిరాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనాభాలో అత్యధిక శాతం ముదిరాజులు ఉన్నప్పటికీ వారికి రాజకీయ పరంగా, విద్యా, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంద న్నారు. వారి జనాభాకు సరిపడా అవకాశాలు రాక అణిచివేతకు గురవుతున్నారు అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారిన ముదిరాజుల తలరాతలు మారడం లేదని, ముదిరాజుల కేవలం ఆయా రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు ముదిరాజులు ఓటు బ్యాంకుగా మారకూడదని, నాయకత్వ లక్షణాలను పెంచుకొని ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండి ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నారు. ఇకనైనా ముదిరాజులు చైతన్యవంతమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పిటిసిలుగా ముదిరాజు లు గెలుపొందేందుకు కులస్తులందరూ సహకరించాలని ఆయన అన్నారు. కులస్తుల మధ్య ఏవైనా మనస్పర్ధలు, గొడవలు ఉంటే సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలని, అంతే తప్ప కక్షలు పెంచుకొని కొరికి ఒకరు సహకరించుకోకుండా ఇతరులకు రాజకీయ అవకాశాలు కల్పించకూడ దన్నారు. త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సంఘాలు లేని గ్రామాల్లో నూతన సంఘాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు.

స్థానిక ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ… ముదిరాజులలో ఐక్యత లోపించిందని ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ఐక్యమత్యంగా ఉండి చట్టప్రకారం,  రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాటాలను, హక్కులను సాధించుకుందాం అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఆలోచించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ముదిరాజు వ్యక్తులకు మద్దతు తెలిపి అధిక సంఖ్యలో వారు గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇతర కులస్తులకు కాకుండా ముదిరాజులకు మాత్రమే ఓటు వేసుకుంటే ఎందరో ప్రజా ప్రతినిధులు పెరుగుతారని, తద్వారా ముదిరాజుల నాయకత్వం మెరుగుపడుతుంద న్నారు. ఏవైనా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అంతిమంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు ఎక్కువ సంఖ్యలో గెలిచేలా చూడాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ నూతన మండల, యువజన కమిటీల కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

  • ఎల్లారెడ్డి మండల ముదిరాజ్ విభాగాల నూతన కార్యవర్గాలు…

ముదిరాజ్ సంఘం ఎల్లారెడ్డి మండల గౌరవాధ్యక్షులుగా కుడుముల సత్యనారాయణ, అధ్యక్షులుగా కొండంగారి రాములు, కార్యనిర్వాహక అధ్యక్షులు దుద్దుల సాయిరాం, ఉపాధ్యక్షులు నీల సిద్ధిరాములు, జక్కుల అశోక్, బాలయ్య, ఒట్లం భాస్కర్, బోనగిరి ఎల్లయ్యలు, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్, కార్యదర్శలుగా కాశీరామ్, లక్ష్మయ్య, చంద్రబాబు, దత్తు, రవీందర్, కాశిరాం, కోశాధికారి మరి సూర్య ప్రకాష్, కార్యవర్గ సభ్యులుగా కేబీ రాజు, పాండు, గంగాధర్, సాయిబాబా, వెంగల్ రాములు లను ఎన్నుకున్నారు.

యువజన కమిటీ అధ్యక్షులుగా కిరణ్ తేజ, ఉపాధ్యక్షులు జనముల పోచయ్య, బద్ధుల రాములు, నీల రవి, క్యాస రమేష్, ప్రధాన కార్యదర్శి కంచుమల్లె మహేందర్, ఉప కార్యదర్శిలు చింతల రమేష్, పెద్ద బోయిన విటల్, అంజయ్య, తలారి సాయిలు, నాగరాజు, లచ్చయ్య ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ సొసైటీ చైర్మన్లు ఏగుల నర్సింలు, బోన్ల సాయిలు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి బాలకిషన్, స్థానిక సొసైటీ సీఈఓ విశ్వనాథం, డైరెక్టర్ మర్రి సూర్యప్రకాష్, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు సాయిరాం, బాలయ్య, ఎల్లయ్య, రవీందర్, లక్ష్మయ్య, కాశీరాం, సంగమేశ్వర్, ఎంపీటీసీ సంతోష్ కుమార్, ఉప సర్పంచ్లు శ్రీకాంత్, యాదయ్య, గంగాధర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెలుట్ల సంతోష్ కుమార్, నీల రవి, ఒట్లం భాస్కర్, ఆయా గ్రామాల ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

The ancient kings should fight for the purpose of state power.

More articles

Latest article