విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభం 

0 18,576
  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభం లాంటిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గొర్తీ ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికీ నగదు పురస్కారాలు అందిస్తున్న గోర్తి  ఈశ్వర ట్రస్ట్ ఫౌండర్ తిరుపతి రెడ్డికి అభినందనలు తెలిపారు. విద్యాతోనే సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని,విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు సేల్ ఫోన్లకు బంధీలు కాకుండా పుస్తకాలతో స్నేహం చేయాలనీ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి పదోవతరగతి ఒక పునాది అని దానిని విద్యార్థులు బలంగా నిర్మించుకుంటేనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యేగా తను గెలిసినప్పటినుండి ముఖ్యంగా విద్య, వైద్యం పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టానని నాణ్యమైన విద్య, వైద్యం నగర ప్రజలందరికి అందించడమే తన లక్ష్యం అన్నారు. నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థినులు వైష్ణవికి 15 వేలు, ఆరాధ్యకి 10 వేలు  నగదు బహుమతి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దినేష్, ఎంఈఓ సాయి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

Education is the cornerstone of community development

Leave A Reply

Your email address will not be published.