25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పైసల వసూళ్ల కే ఆర్టిఏ  చెక్ పోస్టులు

Must read

📰 Generate e-Paper Clip

  • పట్టుబడుతున్న లెక్కల్లో లేని కట్టల కొలది నగదు
  • ప్రైవేట్ ఏజెంట్లతో 24గంటలు కలెక్షనే కలెక్షన్
  • జాతీయ రహదారులపై ఆగని వసూళ్ల దందా
  • రవాణా శాఖ డిప్యూటి కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో మూడోసారి ఏసీబీ తనిఖీలు
  • రవాణా శాఖాధికారులపై చర్యలకు ఏసీబీ సిపారసులు బుట్ట దాఖలు

 

 నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏడాది కాలంగా ఆకస్మీక తనిఖీలతో ఏసీబీ అధికారులు హడలెత్తిస్తున్నారు. కాని వారు అక్కడ లెక్కల్లో లేని నగదు మినహ లంచాలు తీసుకుంటున్నట్లు రవాణాశాఖాధికారులు ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడటం లేదు. పక్కాగా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకొని 24 గంటలు వసూళ్లు చేస్తున్నారు.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఉండగా  నిజామాబాద్, కామారెడ్డి ఆర్టిఓ కార్యాలయాలు, ఐదు యూనిట్ (ఎంవిఐ) కార్యాలయాలు ఉండగా  మూడు చెక్ పోస్టులు ఉన్నాయి. అక్కడ నిత్యం వసూళ్ల కార్యక్రమం మాత్రం ఆగడం లేదు. యూనిట్ కార్యాలయాలు మొదలుకొని చెక్ పోస్టుల వద్ద రవాణాశాఖాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వసూళ్ల కార్యక్రమం చేస్తున్నారు. దానితో ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులకు రవాణాశాఖాధికారులు రెడ్ హ్యండెడ్ గా చిక్కిన దాఖాలాలు లేవు. కలెక్షన్ రాగానే విధులు ముగించుకుని వెళ్లే అధికారులు జేబుల నిండా క్యాష్ తో వెళ్లగా అంతే ఆశతో కొత్త వారు విధులలో కలెక్షన్ చేయడం నిత్య తంతుగా మారింది.

RTA check posts for collection of money

నిజామాబాద్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పొందూర్తి ఆర్టిఏ చెక్ పోస్టుపై గురువారం ఏసీబీ దాడి చేసింది. ఈ దాడిలో ఎఏంవిఐ సాం రిచర్డ్ సన్ తో పాటు ప్రైవేట్ ఏజెంట్ వద్ద అధికారులు రూ.52 వేల నగదును గుర్తించి వారిపై చర్యలకు సిఫారసు చేశారు. గత నెల చివరి వారంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంతరాష్ట్ర సరిహద్ధులోని చెక్ పోస్టుపై  ఏసీబీ అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎఏంవిఐ కవిత వద్ద, ఏజెంట్ల వద్ద తెల్లవారే సరికి రూ.1.20 లక్షల నగదును సీజ్ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తు కలెక్షన్ చేస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు ప్రైవేట్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. గత ఏడాది బోధన్ మండలం సాలురా చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో  డాటా ఎంట్రీ ఆపరేటర్ వద్ధ రూ.12,000 స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తి డిఎఓగా పనిచేస్తు ఏజెంట్ల ద్వారా వసూళు జరుగుతున్నట్టు గుర్తించి చర్యలకు సిఫారసు చేశారు అవినీతి నిరోధకశాఖాదికారులు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రీఛార్డ్ సన్, నాగలక్ష్మి లతోపాటు నలుగురు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.80వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏసీబీ దాడులకు రవాణాశాఖాధికారులు లైట్ గా తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు జాతీయ రహదారులపై ఉన్న సలబత్ పూర్, పొందూర్తి, సాలురా చెక్ పోస్టులు రోజు లక్షల ఆదాయం అందించే కల్పతరువుగా మారాయి. చెక్ పోస్టులో డ్యూటీకే లక్షలు మామూళ్ళు ఇచ్చి పోస్టింగ్ లు తెచ్చుకునే అధికారులు వాటి వసూళ్లకు రాత్రింబగళ్లు విధులు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద రవాణాశాఖాధికారుల రూటే వేరు అన్న చందంగా ఉంది. ఒక్కో ఏజెంట్ కు నిత్యం రూ.2 వేలు చెల్లించి నియమించుకోవడం విశేషం. నెలవారీగా దాదాపు లక్ష వరకు ప్రైవేట్ వ్యక్తుల కలెక్షన్ ఉండగా అధికారుల కలెక్షన్  దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా మాత్రమే. ఇటీవల సలబత్ పూర్ చెక్ పోస్టులో రాత్రి వేళ ఏసీబీ తనిఖీలు చేయగా అక్కడ ఏర్పాటు చేసిన  డబ్బాలో డబ్బులు వేస్తేనే వాహనాలు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు కదులుతున్నాయి. ఏజెంట్లు కలెక్షన్ డబ్బులు వచ్చాయని తెలిసిన తరువాతే వాహనాలను కదలనిస్తున్నారు. పొందుర్తి చెక్ పోస్టులో డైరెక్ట్ గా డ్రైవర్ లు, ఓనర్లు నేరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లడంతోను  వాహనాలు కదులుతుండటం విశేషం. సాలురా చెక్ పోస్టుకు మిగిలిన రెండు చెక్ పోస్టుల స్థాయిలో ఆదాయం లేకున్న అక్కడ నిత్యం కలెక్షన్ వేలల్లో ఉందని గుర్తించారు అధికారులు. అధికారులు రెడ్ హ్యండెడ్ గా దొరక్కపోయిన ఏజెంట్ల ద్వార వసూళ్ల కార్యక్రమంపై సంబంధిత శాఖకు, ప్రభుత్వానికి సిఫారసు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు అలస్యమౌతుండటంతో వారు వీలైతే సెలవులో లేదా డైరెక్ట్ యథావిధిగా ఏసీబీ సోదాల రెండోరోజే కలెక్షన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో రవాణా శాఖ వసూళ్లపై విమర్శల పర్వం నడుస్తుండగా అ శాఖాధికారులు, ప్రభుత్వం ఆలస్యం చేస్తే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని వాదనలు ఉన్నాయి.

More articles

Latest article