- ఐదో టౌన్ ఏరియాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
- 62 బైక్ లు.. 13 ఆటోలు… ఒక కార్ సీజ్
- నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.. తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు సహకరించి భాగస్వాములు కావాలి.. శాంతి భద్రతల పరిరక్షణ ,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ నిజామాబాదు రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణ లో నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు 110 పోలీస్ సిబ్బంది కలిసి శాంతినగర్, హస్మి కాలనీ, ముజాయిద్ నగర్ కాలనీ ప్రాంతం లో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. ఈ తనిఖీలలో 62 బైక్ లు, 13 ఆటోలు, ఒక కారు వాహనాలను సీజ్ చేశారు. కాలనీలలో ప్రజలందరి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు ఉన్నచోట ఎలాంటి నేరం చేయడానికి అయినా భయపడతారని, సీసీ కెమెరాలు 24 గంటలు నిరంతరం రక్షణగా ఉంటాయని తెలిపారు. నేరా నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని.. ప్రజలందరూ సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ప్రతిదీ సీసీ కెమెరా లో నిక్షిప్తమై ఉండడం వలన ఏదైనా నేరం జరిగినప్పుడు నిజా నిజాలను గుర్తించడానికి ,నిందితులను గుర్తించడం సులభం అవుతుందని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెకొరకు మీ దగ్గరకు వస్తే వారి పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ తీసుకోవాలి ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎసిపి కోరారు.

