- మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి
- ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క
కామారెడ్డి, బతుకమ్మ : మహిళాశక్తి చాలా గొప్పదని, కోటి మంది మహిళను కోటిశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలోని వెలమ సంక్షేమ భవన్ లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ రుణం 20 కోట్ల 56లక్షల రూపాయల చెక్కును, కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు 5 కోట్ల 28 లక్షల రూపాయల వడ్డీ రాయితీ చెక్కును, లోన్ భీమా కింద 22 లక్షల రూపాయల చెక్కును, ప్రమాద భీమా కింద ముగ్గురు సభ్యుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున 30 లక్షలు రూపాయల చెక్కు ను అందించారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందినదిగా భావించవచ్చని

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. ఉక్కు మహిళ ఇందిరా పేరుతొ ఇందిరా మహిళా శక్తి పథకానికి ఆ పేరు పెట్టారని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి చెందేందుకు 28000 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను గత సంవత్సరం ఇచ్చామని తెలిపారు. వందల రూపాయల నుండి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి రాష్ట్రంలోని ఐకెపి మహిళా సంఘాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి కొరకు సోలార్ విధ్యుత్, పెట్రోల్ పంపు, లాంటి వ్యాపారాలను మహిళ సంఘాలతో ప్రారంభిస్తున్నామని తెలిపారు. పసుపు వేరే రాష్ట్రాలలో మార్కెటింగ్ చేసే విధంగా జిల్లాలోని మహిళా సంఘాలు ఎదగాలన్నారు. ఫ్రీగా ప్రయాణించడమే కాకుండా ఆర్టీసీ బస్ లకు ఓనర్లను కూడా మహిళలను చేసామని తెలిపారు. మహిళా సంఘాలకు గోదాములను కూడా అందించెందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు. ప్రభుత్వ బడులలో యూనిఫామ్ కుట్టడం ద్వారా గత సంవత్సరం 30 కోట్లు రూపాయలను మహిళా సంఘాలు అర్జించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టల్ లలో సరుకులు సరఫరా చేసేందుకు మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం మీరు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది. మీరు పట్టుదలగ ఎదగాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మీరు తీర్చే అప్పులు ఆదర్శగా నిలుస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడే లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానిలో రుణాలను మహిళా సంఘాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బాలరాజు, సెర్ఫ్ సీఈఓ నగేష్, డిఆర్డిఓ సురేందర్, అధికారులు మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

