28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

Must read

📰 Generate e-Paper Clip

బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ

సికింద్రాబాద్, బతుకమ్మ :  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి  కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్రంలో ప్రజలందరికి మంచి జరగాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వం తరపున ఉదయం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. సోమవారం రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది.

బోనం సమర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM offers silk clothes to Goddess Mahankali

CM offers silk clothes to Goddess Mahankali

CM offers silk clothes to Goddess Mahankali

More articles

Latest article