27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దయానంద్ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ దయానంద్ యోగ ట్రస్ట్ సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం యజ్ఞంతో ప్రారంభమై సూర్య దీక్షితులు గురువు విగ్రహానికి పూలమాలలు వేసి దయానంద్ యోగ ట్రస్ట్ డైరెక్టర్ యోగా రామచందర్ గురుపూజోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గురువులను స్మరించుకోవడం వ్యాస మహర్షి యొక్క రచనలు గురుపూర్ణిమ యొక్క విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ దయానంద్ యోగ సెంటర్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా మాట్లాడుతూ యోగ ట్రస్ట్ తెలంగాణలోని మొట్టమొదటి యోగా సెంటర్ చాలా ఏళ్ల క్రితం సెంటర్ ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులను, యోగ అవార్డ్స్ సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. సెంటర్ డైరెక్టర్ యోగా రామచందర్, ముక్కా దేవేందర్ గుప్తా, శివరాజ్ గుప్తా, నిజాంబాద్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు  ప్రభాకర్, పతాంజలి యోగ సెంటర్ గురువు జిలకర కిషన్, సిద్ధి రాములు, గురుపాదం, ప్రిన్సిపల్ రుక్మన్ రావు, మురళి గుప్తా, శ్రీనివాస్ గుప్తా, నారాయణ, అశోక్, శ్రీనివాస్ చారి, తమ్ముడు శీను, రెడ్ క్రాస్ జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత వసంత లక్ష్మి, రవళి, రాజేందర్, ఆనంద్, సాధకులు, సభ్యులు పాల్గొన్నారు.

Guru Purnima under the auspices of Dayanand Yoga Trust

More articles

Latest article