దయానంద్ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ దయానంద్ యోగ ట్రస్ట్ సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం యజ్ఞంతో ప్రారంభమై సూర్య దీక్షితులు గురువు విగ్రహానికి పూలమాలలు వేసి దయానంద్ యోగ ట్రస్ట్ డైరెక్టర్ యోగా రామచందర్ గురుపూజోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గురువులను స్మరించుకోవడం వ్యాస మహర్షి యొక్క రచనలు గురుపూర్ణిమ యొక్క విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ దయానంద్ యోగ...