28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ వలలో సివిల్ సప్లై కార్యాలయం ఏఓ

Must read

📰 Generate e-Paper Clip

  • రూ.75 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

 

మిర్యాలగూడ, బతుకమ్మ : మిర్యాలగూడలో జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ఏఓ షేక్ జావిద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోమవారం తన కార్యాలయంలోనే రూ.75 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్థార్ గా పనిచేస్తున్న షేక్ జావిద్ డిప్యూటేషన్ పై సివిల్ సప్లై శాఖలో పని చేస్తున్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు మూడు లారీలను సీజ్ చేశారు. సంబంధిత సీజ్ చేసిన లారీల గురించి పంచనామా నిర్వహించి, అదనపు కలెక్టర్ కోర్టు ద్వార విడుదలకు ఏఓ షేక్ జావిద్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. తరువాత రూ.75,000 లంచం తీసుకుంటుండగా నల్గొండ అవినీతీ నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

More articles

Latest article