27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థుల నుండి తిరుగుబాటు తప్పదు

Must read

📰 Generate e-Paper Clip

  • పిడిఎస్యూ ఆధ్వర్యంలో రెండో రోజు కళాశాలల బంద్ విజయవంతం
  • పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

డిచ్ పల్లి, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్  చెల్లించకపోతే విద్యార్థుల నుండి తిరుగుబాటు తప్పదని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ హెచ్చరించారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 7500 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండో రోజు డిగ్రీ పీజీ కళాశాలల బంద్ లో భాగంగా డి చ్ పల్లి మండలంలో విద్యార్థులతో ర్యాలీ, తెలంగాణ యూనివర్సిటీ  లో క్లాసులు బంద్ చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవటం వలన విద్యార్థుల సర్టిఫికెట్స్ కళాశాలలలో ఇవ్వటం లేదని అన్నారు. ఉన్నత చదువులకు పేద మధ్య తరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని మండిపడ్డారు. రియంబర్స్మెంట్ పథకన్నీ ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్ బకాయిలు,పూర్తి స్థాయిలో కోర్స్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు ప్రిన్స్, నిఖిల్, హుస్సేన్, సాయికిరణ్, సాయి. దుర్గాప్రసాద్, కళ్యాణ్ తదితదిరులు పాల్గొన్నారు.

A rebellion from the students is inevitable

More articles

Latest article