26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పురుగుల మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

  • అనాథలైన పిల్లలు

 

రాజంపేట్, బతుకమ్మ : పురుగుల మందుతాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నట్టు రాజంపేట్ ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగంపేట్ మండలం కురుపోలు గ్రామానికి చెందిన చాకలి సుజాత,  చాకలి గంగారాం భార్యాభర్తలు. శివాయి పల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ వ్యవసాయ పొలం వద్ద పనులు చేయడానికి నెల రోజుల క్రితం జీతం ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. వీరికి ముగ్గురు పిల్లలు రామ్, రేవతి, రితిక ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు.

Husband and wife commit suicide by consuming pesticide

More articles

Latest article