24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజావాణి ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సంబందిత అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి 28 అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని పేర్కొన్నారు.

More articles

Latest article