ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజావాణి ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సంబందిత అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి 28 అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు...