27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గోదావరి – బనకచర్లకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : గోదావరి – బనకచర్లకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200టీఎంసీలకు పైగా గోదావరి జలాలలను పోలవరం ప్రాజెక్టు నుంచి క్రిష్ణా, పెన్నాబసిన్ లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయమని అన్నారు. ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ 33వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగ్రుతి, బీఆర్ఎస్ పార్టీల విజయమని అన్నారు. చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జల దోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. గోదావరి – బనక చర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అన్నారు. గోదావరి లో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు గోదావరి – బనక చర్ల ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అన్నారు.

Godavari – Denial of environmental clearance for Banakacharla is gratifying

More articles

Latest article