28.2 C
Hyderabad

’తిహార్ జైలు ఎన్ని సార్లు పిలిస్తే అన్ని సార్లు పోండి..వద్దంటలేం కదా‘

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్

వెబ్ న్యూస్, బతుకమ్మ : నిజామాబాద్ లో పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ఎంపీ ధర్వపురి అర్వింద్  కౌంటర్ ఇచ్చారు. ’తిహార్ జైలు ఎన్ని సార్లు పిలిస్తే అన్ని సార్లు పోండి..వద్దంటలేం కదా‘ అని కవితను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గతంలో కేసీఆర్, కవిత చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన వీడియోను ఎంపీ అర్వింద్ పోస్ట్ చేశారు.   కాగా, ఆదివారం నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించిన విషయం తెలిసిందే.

More articles

Latest article