29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్యకర్తలకు, ప్రజలకు చట్టాలు తెలియవు

Must read

📰 Generate e-Paper Clip

  • మీడియా మీద తిరగబడతారు
  • పసుపు రైతులను బీజేపీ మాయ మాటలతో మోసం చేస్తూనే ఉంది
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :  మీడియా ముసుగులో మా నాయకులైన కేసీఆర్, కేటిఆర్,హరీష్ రావు లపై వ్యక్తిగతంగా ఇష్టమున్నట్టు వ్యాఖ్యలు చేస్తే వారి అభిమానులు ఉరుకోరు.. కార్యకర్తలకు, ప్రజలకు చట్టాల గురించి ఎక్కువగా తెలియదు.. వారి కోపానికి మీరే బాద్యులౌతారు తప్ప మేము  కాదు.. తిరగబడే ప్రమాదముంది..  మీడియా ముసుగులో మీ పరిధులు దాటితే మేము కూడా పరిధులు దాటవలిసి వస్తది అని ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు పార్టీ తరపున హెచ్చరిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇవ్వాలా నిజమాబాద్ లో అమిత్ షా గారి ప్రోగ్రాం చూస్తే సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పే  కవిత్వం లాగా.. మా చెల్లికి పెళ్లి… జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నటు ఉంది బీజేపీ తీరు. ఇంతకు ముందే ప్రారంభించిన పసుపు బోర్డ్ తాత్కాలిక కార్యాలయం ను  మరొక బిల్డింగ్ లోకి మార్చి దేశ హోంమంత్రి అమిత్ షాతో మళ్ళీ ప్రారంభిస్తుంటే జిల్లా పసుపు రైతులు నవ్వుకుంటున్నారు. పసుపు రైతులకు కావాల్సింది తాత్కాలిక కార్యాలయాలు మళ్ళీ మళ్ళీ ప్రారంభిస్తూ ఏమార్చడం కాదు..ఆరుగాలం కష్టపడి నిష్టతో పండించిన పసుపు పంట కు మద్దతు ధర రావాలి. ఇవ్వాలా అమిత్ షా ప్రసంగంలో రాజకీయ అంశాలు తప్ప మద్దతు ధర విషయం,బోర్డు కు నిధుల విషయం,శాశ్వత భవన విషయం ఏమి లేవు. ఇట్లా మొదటి నుండి పసుపు రైతులను బీజేపీ మాయ మాటలతో మోసం చేస్తూనే ఉంది. జాతీయ పసుపు బోర్డు కోసం,పసుపుకు మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేశారు. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఉన్నట్టుండి పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి మళ్లీ బీజేపి తెర తీసి మళ్ళీ ఒక డ్రామా ఆడింది. బోర్డు ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు.శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి, దానికి తగినన్ని నిధులు ఇవ్వాలి. పాలకవర్గాన్ని ,ఎగ్జిక్యూటివ్ బాడీ ని ఏర్పాటు చేయాలి.పసుపుకి మద్దతు ధర లేదు. పసుపుకి క్వింటాలుకు 15000 మద్దతు ధర ప్రకటించి వచ్చేలాగా ఈ బోర్డు ప్రయత్నం చేయాలి.లేకుంటే ఈ బోర్డ్,బోర్డు ఆఫీస్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు’’ అని వ్యాఖ్యానించారు.

More articles

Latest article