24 C
Hyderabad
Sunday, August 2, 2026

లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులుగా మాలవత్ ప్రకాష్ నాయక్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : లంబడా హక్కుల  పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నూనావత్ గణేష్ నాయక్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులుగా మాలవత్ ప్రకాష్ నాయక్ నియామక పత్రం అందుకున్నారు.  ఈ సందర్భంగా లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మాలావత్  ప్రకాష్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, అట్టి విషయం పైన విద్యార్థులకు అన్యాయం  జరగకుండా చూడాలని ఉద్దేశంతోటే ప్రకాష్ నాయక్ ను కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని తెలిపారు. అనంతరం కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా నియమితులైన మాలవత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ నా మీద  నమ్మకంతో నాకు కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా నియమించినందుకు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నూనావత్ గణేష్ నాయక్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే నాకు నమ్మకంతో నన్ను నియమించారో  దానిని  తూచా తప్పకుండా పాటిస్తానని తెలిపారు. నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు గణేష్ నాయక్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article