29 C
Hyderabad
Monday, August 3, 2026

మోడీ సర్కార్ పదేళ్ల కాలంలో పాకిస్థాన్ కు తడాఖా చూపింది

Must read

📰 Generate e-Paper Clip

  • మావోయిస్టులను లొంగిపోవాలని హెచ్చరించిన పట్టించుకోకనే ఆపరేషన్ కగార్
  • ఇప్పటికీ రాహుల్ బాబా ఏవో ప్రశ్నలు వేస్తుంటాడు
  • కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

 

నిజామాబాద్, బతుకమ్మ : గత కాంగ్రెస్ సర్కార్ పాకిస్థాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది.. మోడీ ప్రధానిగా పదేళ్ల కాలంలో పాకిస్థాన్ కు భారత్ తడాఖా ఏంటో చూపిందని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రలో పసుపు బోర్డు ప్రారంభించిన అనంతరం కంఠేశ్వర్ లో దిగంవత మాజీ మంత్రి డీఎస్ విగ్రాహావిష్కరణ చేశారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాకిస్థాన్ తో యుద్ధం విషయంలో రాహుల్ బాబా ఇప్పటికీ ఏవో ప్రశ్నలు వేస్తుంటాడని, అవి పట్టించుకోమని అన్నారు. దేశంలో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన నక్సల్స్ ను ఏరివేసేందుకు ఆపరేషన్ కాగార్ చేయాలా వద్దా అని ప్రశ్నించారు. ఇది వరకే మావోయిస్టులను లొంగిపోవాలని హెచ్చరించినా లొంగి పోలేదు కాబట్టి ఆపరేషన్ కగార్ చేపట్టామని గుర్తు చేశారు. 2026వరకు దేశంలో మావోయిజం లేకుండా చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు.

  • కాంగ్రెస్ కు నూకలు చెల్లేరోజు వస్తుంది..

తెలంగాణలో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అవినీతికి పాల్పడిందో ప్రజలకు తెలుసని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, టీఎస్ పీఎస్సీ వంటి వాటితో బీఆర్ఎస్ ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అయితే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటిఎంలా తయారైందని విమర్శించారు. తెలంగాణా జనం బీఆర్ఎస్ జెండాను పీకిపారేశారని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు కూడా నూకలు చెల్లే రోజు వస్తుందని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇక్కడి ప్రజలు, యువత, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని అన్నారు. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడని, ఆయన విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు.

Modi government has shown a lot of support to Pakistan in the past ten years.

  • ఇందూర్ రైతుల పోరాటాన్ని గుర్తించి మోదీ సర్కార్ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది..

నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించడం నా అద్రుష్టమని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇందూర్ రైతుల పోరాటం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోడీ సర్కార్ పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు  మోడీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. అనాదిగా నిజామాబాద్ రైతులు పసుపు సాగు చేస్తున్నా మార్కెట్ లో అనుకున్న గుర్తింపు దక్కలేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందనుందన్నారు. నిజామాబాద్ జిల్లో పసుపు రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, భారత్ కో ఆపరేటివ్ బ్రాంచ్ ను, భారత్ కో ఆపరేటివ్ ఎక్స్ పోర్ట్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పసుపు యాంటీ బయోటిక్, పసుపు మన దైనందిన జీవితంలో భాగమని  దానికి గ్లోబల్ ఐడెంటిటీ కోసం పాటు పడుతున్నామన్నారు. 2025లో పసుపు ధర క్వింటాలుకు రూ.19వేలు పలికిందని, రానున్న మూడేళ్లలో రూ.7వేలు అధికం కానుందన్నారు. రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిక జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చేసి ఇక్కడి ప్రజలకు గుర్తింపును ఇచ్చామన్నారు. 2030లోపు వన్ మిలియన్ డాలర్ పసుపు ఎగుమతి ప్రణాళికలు వేసామన్నారు. రాబోయే రోజుల్లో పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సీటీ కాబోతుందని అన్నారు.

Modi government has shown a lot of support to Pakistan in the past ten years.

More articles

Latest article