27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మాజీ మంత్రి డీఎస్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకున బైపాస్ రోడ్డులో ఆయన తనయుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రూ.44లక్షల వ్యయంతో 14అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో కేంద్రమంత్రలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు, ఇంచార్జీ మంత్రి సీతక్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నగేశ్వరరావు, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లే గంగారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article