29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

జోరుగా ఇసుక దందా

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ :  ఇసుక అక్రమ వ్యాపారం మాక్లూర్ మండలంలో జోరుగా సాగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు.  వాగుల్లో రోజంతా ఇసుక కుప్పలు పోసి సాయంత్రం, ఉదయం, రాత్రి వేళల్లో గ్రామాలకు ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తున్నారు. ముఖ్యంగా నవీపేట్ మండలంలోని జన్నేపల్లి, మాక్లూర్ మండలంలో చిక్లి, గుంజిలి, పెధ్ద  వాగుల నుంచి మాదాపూర్ గ్రామంలో మట్టిని ఫిల్టర్ చేసి మరీ ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం ఇసుక కరువై నిరుపేదలు ఇసుక కోసం నానాతంటాలు పడాల్సి వస్తుంది. అక్రమ ఇసుక  రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Sand mining boom

More articles

Latest article