నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లి శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. నగరంలోని శాంతినగర్ కు చెందిన అబ్ధుల్ జావిద్ (29) అనే యువకుడు అర్సపల్లి శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో మృతి చెంది ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలం ఆధారంగా రైలు నుంచి జారీ పడి జావీద్ మృతి చెంది ఉండవచ్చని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం ఆధారంగా అది ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీపడి చనిపోయాడా లేక ఏం జరిగి ఉంటుందో అని తెలుస్తుందని ఎస్ఐ తెలిపారు.
