24.7 C
Hyderabad
Monday, August 3, 2026

దేశం కోసం ప్రాణాలిచ్చిన నేత ముఖర్జీ

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్

 

వేల్పూర్, బతుకమ్మ : దేశం కోసం ప్రాణాలిచ్చిన మహనీయుడు, గొప్ప నేత డాక్టర్. శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బేల్దారి అన్నారు. సోమవారం మండలంలోని కుకునూర్ గ్రామ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముఖర్జి చిత్రపటం పై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత,సమగ్రతల కోసం ప్రాణాలర్పించిన నిస్వార్థ దేశభక్తుడు,జన సంఘం వ్యవస్థాపకుడు,జాతీయ ఐక్యత, దేశ ఉజ్వల భవిషత్తుకు పాటుపడిన మహానేత,విద్యావేత్త ప్రఖ్యాత రాజ నీతజ్ఞుడు అని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశ సేవలు ఎనలేనివని  నవీన్ అన్నారు. ఈ  కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ భానుచందర్ మండల కార్యదర్శి రాకేష్, నీలేందర్,ర్యాడ శీను, రాజేందర్ కుక్కునూరు  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article