27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఏఐబీఎస్ఎస్ మండల కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా  ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్నికల నిర్వాహణ అధికారి  భూక్యా లక్ష్మన్ నాయక్ ,తాజా మాజీ బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు  భూక్యా చంద్రు నాయక్ ,ఆర్మూర్ డివిజన్  ఎన్నికల పర్యవేక్షకుల  బాదావత్ శర్మ నాయక్ ఆధ్వర్యంలోబాల్కోండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మర్ పల్లి మండల బంజారా సవా సంఘ్ మండల అధ్యక్షుడు గా మాలవత్  ప్రకాష్  నాయక్, ప్రధాన కార్యదర్శిగా లాకావత్ గంగాధర్ నాయక్ లను ఎన్నుకున్నారు. ఏర్గట్ల  బంజారా సేవా సంఘ్ మండల అధ్యక్షుడుగా రాథోడ్ ఆంజనేయులు నాయక్, ప్రధాన కార్యదర్శి గా మాలవత్  భీమా నాయక్ లను తాండా నాయక్, కార్భారీలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజారా బిడ్డలు ఐకమత్యం తో ఉండాలని, బంజారా జాతి పట్ల అంకితభావం తో నిజాయితీ తోపని చేయాలనీ అన్నారు. జాతి ఉన్నతిని కాపాడాలని, నూతనంగా ఎన్నికైన మొత్తం  కార్యవర్గ సభ్యులను కోరారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, శాలువాలతో సన్మానించారు.

More articles

Latest article