26.6 C
Hyderabad
Monday, August 3, 2026

అన్నఖాతా హ్యక్ అయిందని నమ్మించి తమ్ముడి ఖాతాలోడబ్బులు కోట్టేసిన కేటుగాళ్లు

Must read

📰 Generate e-Paper Clip

. . . బ్యాంక్ ఖాతా నుంచి 94,160 నగదు మాయం

బతుకమ్మ,మోర్తాడ్:

మీ అన్నయ్య నెంబర్ హ్యక్ అయింది దాని వివరాలు తెలుపండి అని సైబర్ కేటుగాళ్లు తమ్ముడికి పోన్ చేసి అతను ఇచ్చిన వివరాలతో అతని బ్యాంకునుంచి నగధు కాజేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన మైలారం ప్రవీణ్ కు అకౌంట్లో నుండి డబ్బులను సైబర్ మోసగాళ్లు మాయం చేశారు. ప్రవీణ్ అకౌంట్లో నగదును మాయం చేసేందుకు ఆయన సోదరుడు సైబర్ మోసగాళ్లు హ్యక్ చేసి ఆ నెంబర్ నుంచి ఏదో బ్యాంకు లింకు పంపినట్టుగా పంపి దాని ద్వారా వారికి ఓటిపి ఇతర వివరాలు తీసుకున్నారు. అతను ఇచ్చిన వివరాలతోనే మైలారం ప్రవీణ్ అకౌంట్లో నుంచి రూ. 94, 160 నగదును మాయం చేశారు. మా అన్నయ్య నెంబర్ ఆడ్ చేసి ఆ నెంబర్ నుంచి బ్యాంక్ డీటెయిల్స్ కావాలని తెలుసుకొని తనను మోసం చేశారని బాధితులు మైలారం ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేసిండు, మైలారం ప్రవీణ్ మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More articles

Latest article