27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మాదిగల ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ

 

కామారెడ్డి టౌన్, బతుకమ్మ:  మాదిగల ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం కృషితో పాటు ఎమ్మార్పీఎస్ ప్రతి కార్యకర్త కృషి వల్లనే పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ కు  పద్మశ్రీ అవార్డు లభించిందని అన్నారు. జిల్లాలో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండల అధ్యక్షుడు గ్రామాలలో కార్యవర్గాలను బలోపేతం చేసే విధంగా చూడాలని అందుకుగాను నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని నియమించుకునే విధంగా సీనియర్ నాయకులు పాత్ర వహించాలని అన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని మండలాలలో తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అందుకు సీనియర్ జూనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బట్టు వెంకటరాములు, భూపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సట్టిగారి లక్ష్మి, యాదగిరి, లావణ్య, సాయిలు, బాలమణి, జర్నలిస్టు ఫోరం నాయకులు కుంటోళ్ళ యాదగిరి, రాజు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article