27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం మొలకలు వచ్చాయ్

Must read

📰 Generate e-Paper Clip

  • కొనుగోలులో తీవ్ర జాప్యం
  • కల్లాల్లో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముందస్తుగా పడుతున్న వానలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వర్షకాలం ముందుగా  ప్రారంభమైనందుకు ఆనందపడాలో లేక గత సీజన్ లో ధాన్యం ఇప్పటికి మిల్లులకు తరలించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రెండు రోజుల క్రితం ఇందల్వాయి మండలానికి చెందిన రైతు ధాన్యం కొనుగోలు చేసిన తరుగు, హమాలీల కొరత, లారీల కొరత పేరిట వడ్లను అన్ లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో అవి మొలకలు వచ్చాయి. సంబంధిత ధాన్యం లారీని జిల్లా కలెక్టరేట్ కు తీసుకువచ్చి జిల్లా అధికార యంత్రాంగం వద్ధ నిరసనకు బిజేపి సిద్ధమైంది. కాని సంబంధిత లారీ రిపేర్ కావడంతో  కేవలం కొన్ని వడ్లతో నిరసనకు దిగారు బిజేపి నాయకులు, రైతులు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు రైతుల గోస చెప్పుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వ్యాపారులు, దళారులు కొనుగోలు చేయగా మిగిలిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా విధించుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈసారి మహిళా సమాఖ్యకు సగానికి పైగా కేంద్రాలను కేటాయించారు. జిల్లాలో దాదాపు 8.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగలేదు. ఈనెల మొదటి వారంలో కల్లాలలో, కొనుగోలు కేంద్రాల వద్ధ తూకాలు సాగిన ధాన్యం ఇప్పటికీ మిల్లులకు తరలలేదు. అందుకు అధికార యంత్రాంగం చొరవ తీసుకుంటున్న లారీల కొరత, హమాలీల కొరత , తరుగు కారణం అని చెబుతున్నారు.

  • రైతన్నల బాధలు పట్టవా..?
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి రైతులు, బీజేపీ నాయకులు సోమవారం కలెక్టర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఇందూరు జిల్లాలో  8,60,000 వేలు మాత్రమే వడ్లు కొనుగులు జరిగింది అన్నారు. ఇంకా 3 లక్షల పైచిలుకు వడ్లు కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల లో అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగులు చేయక వడ్లు మొలకెత్తి దెబ్బ తింటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తిరస్కరించడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. “రైతన్న పండించిన మొల్కత్తు వడ్లను తీసుకోకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చేతులెత్తేయడం మానుకుని, తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలి. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం” అని దినేష్ పటేల్ హెచ్చరించారు. “వడ్లు పండింది, కానీ అమ్ముకునే ఆశ లేదు. దారి లేదన్న భావనలో ఉన్నాం. ప్రభుత్వానికి గిట్టుబాటు ధర లక్ష్యం కాదు, రైతన్న జీవితం విలువలేనిదా?” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి,కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హరీష్ రెడ్డి, శంకర రెడ్డి, నాయిడి రాజన్న, జనార్దన్ రెడ్డి, బొబ్బిలి వేణుగోపాల్,గిరి,అమందు విజయ్ కృష్ణ,శివునూరి భాస్కర్,శ్రీధర్ గుప్తా,మఠం పవన్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

The grain sprouts have arrived.

More articles

Latest article