27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఆదివారం జిల్లా కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ని అన్ని మండలాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు 10వ తరగతిలో 450 మార్కుల పైబడి వచ్చిన విద్యార్థులు, ఇంటర్లో 900 పై బడి వచ్చిన విద్యార్థులకు పురస్కారాలను  అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ… ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంఘం తరపున ముందుంటామన్నారు. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. మంచిగా చదివే విద్యార్థులకు ఎల్లవేళలా సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య, మాజీ అధ్యక్షులు మామిండ్ల అంజయ్య, లింగం, మహిళ జిల్లా అధ్యక్షురాలు లలిత, గాంధారి మండల మున్నూరు కాపు మండల అధ్యక్షులు ఆకుల బాల్ కిషన్, రామారెడ్డి మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శిలు, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Talent awards presented to students

More articles

Latest article