భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పలు భాదిత కుటుంబాలను బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా కారేపల్లి హనుమాన్ తాండ కి చెందిన గణపతి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. తాళ్ల పెళ్లి గ్రామానికి చెందిన మోహన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇరు భాదిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
