28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన కంప్యూటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని ప్రజా గ్రంథాలయంలో సోమవారం నూతన కంప్యూటర్లను బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్ విద్యను అభ్యసించేందుకు వీలుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అభ్యర్థన మేరకు గ్రంథాలయ శాఖకు 5 కంప్యూటర్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు వినియోగించుకుంటూ  “ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ విద్యలో ఉన్నతిని సాధించాలని” ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి  నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి ప్రాముఖ్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు, ప్రాజెక్ట్ పనులు, ఇంటర్నెట్ ఆధారిత అధ్యయనం వంటి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథాలయ చైర్మన్ తో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, నుడా చైర్మన్ కేశ వేణు, పిసిసి డెలికేట్ గంగా శంకర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ నిర్వాహకులు సభ్యులు విద్యార్థులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

MLA Sudarshan Reddy launches new computers

More articles

Latest article