25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హెన్రీ డునాంట్ కు ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రపంచ రెడ్ క్రాస్ స్థాపకుల్లో ఒకరైన హెన్రీ డునాంట్ జయంతిని నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు హేన్రి డునాంట్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. అందరూ సమష్టిగా సమైక్యతతో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛంద సంస్థలు కలిసి నడిస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇందుకు రెడ్ క్రాస్ సంస్థ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్ లో సేవలను మరింత పెంచేందుకు నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మానవవాదులు ముందుకు వచ్చి అండగా నిలవాలన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ 84వ సారి, అలాగే రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి , రామకృష్ణ రక్తదానం చేశారు. 

రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్ భవన్ లో బుధవారం నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి కరిపె రవీందర్, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, వైస్ చైర్మన్ మురళీకృష్ణ , జూనియర్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, యూత్ కో ఆర్డినేటర్ మాణిక్యాల శ్రీనివాస్, ఎంసీ మెంబర్లు శ్రీనివాస్, సోలమన్, బాబా శ్రీనివాస్, వెంకటేశ్వర్లు , డాక్టర్ రాజేశ్, బొద్దుల రామకృష్ణ, బాల్ భవన్ సూపెరిండెంటెంట్ ప్రభాకర్,  సిబ్బంది పాల్గొన్నారు.

A tribute to Henry Dunant3

More articles

Latest article