26.2 C
Hyderabad

10న ‘కేర్’ లో క్యాంపస్ డ్రైవ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బ్యాంకింగ్ లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీజీఆర్ఏడీ సహకారంతో నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 10వ తేదీన క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపాల్ బాలకృష్ణ గురువారం తెలిపారు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీ కోసం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నారని, శనివారం ఉదయం 10.30గంటల ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. డిగ్రీ, బీటెక్ లో 50శాతం మార్కులు సాధించి 30 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు.

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9885050761 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

More articles

Latest article