హెన్రీ డునాంట్ కు ఘన నివాళి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రపంచ రెడ్ క్రాస్ స్థాపకుల్లో ఒకరైన హెన్రీ డునాంట్ జయంతిని నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు హేన్రి డునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ సమష్టిగా సమైక్యతతో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు కలిసి నడిస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇందుకు రెడ్ క్రాస్ సంస్థ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్ లో సేవలను...