28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కేజీబీవీలకు నాణ్యతలేని మెటీరియల్ సరఫరా

Must read

📰 Generate e-Paper Clip

  • రెండు మెటీరియల్ సరఫరా చేయకున్నా చేసినట్లు సర్టిఫై
  • నాణ్యత పరిశీలించకుండానే మెటీరియల్ కొనుగోళ్ళు
  • బాధ్యులపై చర్యలు తీసకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గత విద్యా సంవత్సరంలో రెండు కేజీబీవీల ఏర్పాటుకు విద్యాశాఖ అంగీకరించింది. అందులో భాగంగా రెండు కొత్త మండలాలైనా నార్త్,  సౌత్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీబీవీ పాఠశాలల్లో ఉద్యోగుల రిక్రూట్ మెంట్ చేశారు. అనంతరం ఎండీఎం మెటీరియల్ కు ఎస్ఎస్ఏ నుంచి జీసీఈఓ రూ.5 లక్షలు డీఈఓ ప్రొసీడింగ్ ద్వారా మంజూరు చేసి కమిటీ ఆమోదం తెలపాలని నోటీసులు జారీ చేశారు. ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ హాజరై నాణ్యత వెరిఫై చేసిన తర్వాత సామాగ్రి కొనుగోలు చేయాలి. ఆయన సర్టిఫై చేయకపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ను నాణ్యతను పరిశీలించడానికి డీఈఓ ప్రొసీడింగ్ ఇచ్చారు. కానీ ఆయన హాజరు కాలేదు. నిబంధనలు ఉల్లంఘించి నార్త్ , సౌత్ ఎంఈఓలు క్వాలిటీ లేని వాటిని క్వాలిటీ ఉందని సర్టఫై చేసి రెండు ఐటమ్స్ ఇవ్వకున్నా ఇచ్చినట్లు రాసినట్లు తెలిసింది. సమగ్ర విచారణ జరిపి పరిశ్రమల జనరల్ మేనేజర్ కు నాణ్యత ద్రువీకరణ పెట్టాలి. రెండు మెటీరియల్స్ ఇవ్వకున్నా ఇచ్చినట్లు సర్టిఫై చేసినందుకు విచారణ జరపాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

More articles

Latest article