27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అదనపు గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్‌లో ఉన్న శ్రీ రామ మందిరం ఆలయంలో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బోధన్ స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గదులను ప్రారంభించారు. ముందుగా రామ మందిరంలో విశేష పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణలతో కలశయాత్ర జరిపి గదుల ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శర్మ మాట్లాడుతూ, “ఈ అదనపు గదుల నుండి వచ్చే ఆదాయం రామ మందిర అభివృద్ధికి ఉపయోగపడుతోంది,” అని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. గదుల్లో నివాసం ఉంటున్న భక్తులు తప్పనిసరిగా వేతనాన్ని చెల్లించాలని, శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోధన్ రామ మందిరం అభివృద్ధికు అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

MLA Sudarshan Reddy inaugurates additional rooms

More articles

Latest article