అధికారుల సూచన మేరకే రసాయన మందులు వాడాలి

0 14,541
  • తెలంగాణ సీడ్స్ విత్తనాలనే రైతులు కొనండి
  • టీజీసీడీసీ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : రైతులు పంటలు పండించడంలో అవసరానికి మించి రసాయన మందులు వాడరాదని, వ్యవసాయాధికారుల సూచన మేరకే రసాయన మందులు వాడాలని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని ముచ్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు సాధ్యమైనంత వరకు యూరియా వాడకాన్ని తగ్గించాలని, అవసరం మేరకే పురుగుమందులను వాడాలన్నారు. రైతులకు అధిక దిగుబడిని పొందాలంటే గవర్నమెంట్ సీడ్స్ సంస్థ నుండే తీసుకోవాలని, ప్రయివేట్ వారి వద్ద సీడ్స్ తీసుకొని మోసపోవద్దని అన్నారు. రైతుల కోసం వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంగా ఉంచిందని, విత్తనాలతో పాటు జీలుగు, జనుము విత్తనాలు కూడా మీ మీ స్థానిక సొసైటీల ద్వారా అందించడం జరుగుతుందన్నారు.రైతులు తప్పనిసరి అయితే ప్రైవేట్ వ్యాపారుల వద్ద విత్తనాలు కొనేగోలు చేసే సమయంలో కంప్యూటర్ రసీదును తీసుకోవాలన్నారు. ఈ రభి సీజన్లో మన మండలంలోని చాలా గ్రామాల్లో ప్రైవేటు కంపెనీల విత్తనాలను తీసుకొని చాలా వరకు రైతులు నష్టపోయారని, వారి వద్ద కొన్న బిల్లులు లేకపోవడం వల్ల వారు ఎలాంటి  నష్టపరిహారాన్ని పొందలేక పోయారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని, రైతులకు సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు పెట్టడం గాని, తరుగు, తాలు లేకుండా వరి ధాన్యాన్ని తీసుకోవడం, రైతులకు అనా పైసా డబ్బులు కట్ కాకుండా,చెల్లించడం జరిగిందన్నారు.అట్లాగే పంట పండించే రైతును దృష్టిలో ఉంచుకొని 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని,  ఒక్కొక్క రైతు ఎకరాకు 12,500 చొప్పున బోనస్ రూపంలో అదనపు ఆదాయం రైతుకు సమకూరుతుందన్నారు.దీని ద్వారా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, మిగిలిన రైతు భరోసా రుణమాఫీ త్వరలోనే చెల్లించడం జరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప, తప్పకుండా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. రైతులందరు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని, వారు కోరారు . ఈ కార్యక్రమంలో, జె డి ఏ సాయికృష్ణ,ఏవో లావణ్య , మండల ఏఈవోలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రీలత, దినేష్ వీరితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భోదిరి స్వామి, డిసిసి డెలిగేట్  కుంట రమేష్ , మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, బీసీ సెల్ అధ్యక్షుడు కోరాడిరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనంతరావు, పిఎసిఎస్ చైర్మన్ బంగ్లా దేవేందర్, వైస్ చైర్మన్ గంగారెడ్డి,  మండల యూత్ అధ్యక్షులు అవినాష్, గ్రామ విడిసి అధ్యక్షులు,ఉపాధ్యక్షులు  మండల కాంగ్రెస్ పార్టీ  నాయకులు, భూ రెడ్డి సంతోష్ రాజేష్, రాజేశ్వర్ లింబాద్రి ప్రవీణ్ మురారి  కిషన్ గంగాధర్, సుదర్శన్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.