అదనపు గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్‌లో ఉన్న శ్రీ రామ మందిరం ఆలయంలో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బోధన్ స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గదులను ప్రారంభించారు. ముందుగా రామ మందిరంలో విశేష పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణలతో కలశయాత్ర జరిపి గదుల ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శర్మ మాట్లాడుతూ, "ఈ అదనపు గదుల నుండి...