ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం నిజాంసాగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న రామలింగం బావి దగ్గరలో గుట్టపై నిర్మాణం చేసిన మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో ఎలుగు బంటి కనిపించింది. తునికి ఆకులు సేకరించేందుకు వెళ్లిన గ్రామస్తులకు ఆదివారం మధ్యాహ్నం ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటిని చూసినవారు భయంతో పరుగులు తీశారు.
