. . . 100 మంది విద్యార్థులు గైర్హజరు
. . . బోధన్ లో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని అనుమతి నిరాకరణ
. . . పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ
నిజామాబాద్, బతుకమ్మ:
నీట్ ( మెడికల్ 2025 యూ జి ప్రవేశ పరీక్ష) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 3398 మంది విద్యార్థుల కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 3298 మంది విద్యార్థులు హాజరు కాగా 100 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.
జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల జూనియర్ కళాశాల వద్ధ పరీక్ష కేంద్రంలో విద్యార్థుల తనిఖీ విషయం పోలీస్ అధికారులు, పరిక్ష కేంద్ర సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది. బోధన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాల వద్ద నీట్ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రాల వద్ద ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను లోనికి అనుమతించలేదు. దానితో ముగ్గురు విద్యార్ధినిలు కన్నీరుమున్నీరయ్యారు .

నిజామాబాద్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ,గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ పీజీ బ్లాక్ లో జరిగిన నీట్ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బందొబస్త్ ఏర్పాటు ను పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షా సరళి ని పరిశీలించారు.

