నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను నుడా చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ప్రవీణ్ పరిశీలించారు.

నూతన ట్రాఫిక్ జంక్షన్ ల ఏ ర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే వినాయక్ నగర్, బోధన్ రోడ్, గౌతం నగర్, హైదరాబాద్ బైపాస్ ఏరియాల్లో నీరు నిలిచే ప్రదేశాలను పరిశీలించి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెద్ద డ్రెయినేజీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో స్మార్ట్ సిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారి ఆధ్వర్యంలో నగరంతోపాటు జిల్లా అభివృద్ధి చెందుతోందని, ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
